వేద పండితులకు ఉగాది పురస్కారాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చ కులు, వేద పండితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు ప్రకటించారు.

Update: 2023-03-22 10:40 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చ కులు, వేద పండితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు ప్రకటించారు. నేపధ్యంలో బుధవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో దేవాదాయ శాఖ వారు ఉగాది వేడుకల్లో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్, ఉప ప్రధాన అర్చకుడు చంద్రగిరి శరత్ శర్మకు అర్చక విభాగంలో, యజుర్వేద పండితుడు అన్నవరపు ఆంజనేయ శర్మకు వేదపారాయణం విభాగంలో ఉగాది పురస్కారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.

Tags:    

Similar News