గంజాయి కేసులో ఇద్దరి నిందితుల రిమాండ్

అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ ఈ నెల 23న రాయికల్ పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల రూరల్ సిఐ ఆరిఫ్ అలీ ఖాన్ తెలిపారు.

Update: 2024-05-25 14:02 GMT

దిశ, రాయికల్ : అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ ఈ నెల 23న రాయికల్ పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల రూరల్ సిఐ ఆరిఫ్ అలీ ఖాన్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… గంజాయి విక్రయించి అధిక డబ్బులు సంపాదించాలనే దురాశతో కోరుట్ల పట్టణానికి చెందిన మానాల అక్షిత్ (21), మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన మెండే నివేద్(19), అనే ఇద్దరు నిందితులు గంజాయి తరలిస్తూ పట్టుబడగా శనివారం జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్, ఎస్సై అజయ్ రిమాండ్ కు తరలించారు. వారి వద్ద సెల్ల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Similar News