జేపీఎస్ నిరసన దీక్షలో కలిసిన ఆ ఇద్దరు నేతలు

జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చేపట్టిన నిరసన దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

Update: 2023-05-10 10:29 GMT

దిశ,  జగిత్యాల ప్రతినిధి : జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చేపట్టిన నిరసన దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు నిరసన దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కార్యదర్శుల నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతుండగా ..అక్కడకు వచ్చిన బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జీవన్ రెడ్డిని ఆత్మీయంగా పలకరించారు. రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఇలా దీక్ష శిబిరంలో ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకోవడంతో అక్కడే ఉన్న జూనియర్ పంచాయతీ సెక్రెటరీలతో పాటు ఇరు పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


Also Read...

కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత హనుమాన్ చాలీసా పారాయణం 

Tags:    

Similar News