ఎన్జీటీ ఆర్డర్స్ అమలు చేయండి సార్..

పెద్దపల్లి జిల్లా మానేరు పరిరక్షణ సమితి సభ్యులు 'నిను వీడని నీడను నేనే'.. అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.

Update: 2023-02-03 15:02 GMT

దిశ, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా మానేరు పరిరక్షణ సమితి సభ్యులు 'నిను వీడని నీడను నేనే'.. అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఓ వైపున ఎన్జీటీలో న్యాయ పోరాటం చేస్తూనే మరో వైపున ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయాలంటూ.. అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా అధికారులకు ఎన్జీటీ ఇచ్చిన స్టే విషయాన్ని చేరవేసిన మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు శుక్రవారం టీఎస్ఎండీసీ కార్యాలయానికి వెళ్లారు.

హైదరాబాద్‌లోని టీఎస్ఎండీసీ కార్యాలయానికి వెళ్లిన సంస్థ ప్రతినిధులు ఎండీని కలవాలనుకున్నప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడంతో జీఎం పాండురంగారావు ను కలిసి పూర్తి వివరాలు వెల్లడించారు. నేషనల్ గ్రీన్ ట్యిబ్యునల్ డిసెంబర్ 23న ఇచ్చిన స్టే ఆర్డర్‌తో పాటు.. జనవరి 23 నాటి ఉత్తర్వులను కూడా అందజేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించిన ఎంపీఎస్ ప్రతినిధులు ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పెద్దపల్లి జిల్లా మానేరులో మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు.

Similar News