సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. : కొప్పుల ఈశ్వర్

సాధ్యం కాని హామీలను గుప్పించి, ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారం

Update: 2024-05-08 10:25 GMT

దిశ,సుల్తానాబాద్ : సాధ్యం కాని హామీలను గుప్పించి, ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, నాలుగు నెలల్లోనే పూర్తిగా వైఫల్యం చెందిందని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం మున్సిపల్ పట్టణ కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈశ్వర్ మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పై అనతి కాలంలోనే వ్యతిరేకత మొదలైందని, అరచేతిలో వైకుంఠం చూపించారని దుయ్యబట్టారు. మహిళలకు రూ.2500 ఇస్తామని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం అందిస్తామని చెప్పి తుస్సు మనిపించారని, విద్యార్థినిలకు లాప్టాప్ లు స్కూటీలు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు నెలకు రూ 4000 రూపాయలు అందిస్తామని, రైతు రుణమాఫీ రెండు లక్షల రుణం అందిస్తామంటూ రైతులకు బోనస్ చెల్లిస్తామని అనేక వాగ్దానాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ నాయకులను, ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కెసీఆర్ కిట్టు ప్రతి ఒక్క పథకాన్ని ఎత్తివేసి పాలన కొనసాగిస్తున్నారని, ప్రతిపక్షంగా ఉండి ప్రశ్నిస్తే గుడ్లు పీకుదాం, పేగులు మెడలేసుకుంటాం అంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కి తగిన విధంగా ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రపంచ దేశాలు మెచ్చుకునే స్థాయికి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని తీసుకెళ్లి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించారని అన్నారు.

పెన్షన్లు రూ. 4000 ఇస్తామని చెప్పి పెన్షన్ అందించిన దాఖలాలు లేవని కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 7500 కోట్ల రూపాయలను అందించేందుకు సిద్ధంగా ఉంచితే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు అధికారం చేపట్టి బినామీ కాంట్రాక్టర్లకు అందించారని ఎద్దేవ చేశారు. తిరిగి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందాలంటే బి.ఆర్.ఎస్ ఎంపీలను గెలిపించి ఢిల్లీలో తెలంగాణ వాదాన్ని వినిపించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించేందుకు బస్సు యాత్ర చేపడితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంగళహారతులు బూడిద గుమ్మడి కాయ తో స్వాగతిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం మేరకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారని ఈ నెల 13న.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కొప్పుల ఈశ్వర్ గెలిచినప్పుడే ప్రజా సమస్యలను పార్లమెంట్ లో ప్రశ్నించే అవకాశం ఉంటుందన్నారు.

ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మి మోసపోకుండా.. కారు గుర్తుకు ఓటు వేసి, దొంగ హామీల కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆదరించి అభిమానించే నాయకులకు అవకాశం ఇచ్చి గెలిపించాలని అన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలకు ప్రజలకు అండగా నిలిచేది టిఆర్ఎస్ పార్టీ ఒకటేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, సింగిల్ విండో చైర్మన్లు, జూపల్లి సందీప్ రావు, గడ్డం మహిపాల్ రెడ్డి, పాల రామారావు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు గట్టు శ్రీనివాస్, శీలం శంకర్, సంపత్ అనిత అంజయ్య , నిర్మల ఓదెలు, గొట్టం లక్ష్మి ,కూకట్ల గోపి ,రేవెల్లి తిరుపతి, అర్బన్ పారుపల్లి గుణపతి, బాబురావు, మొలుగూరి అంజయ్య గౌడ్, తాళ్లపల్లి మనోజ్ గౌడ్, సూర శ్యామ్, దయాకర్, అరుణ్, ఆంజనేయులు ,రమణ , తాజా మాజీ సర్పంచులు పెద్ద సంఖ్యలో మహిళలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు.

Similar News