ఆర్థిక ఇబ్బందులు తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక, మానసిక ఆవేదనకు ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడిన ఘటన మండల పరిధిలోని గంగారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

Update: 2023-04-15 15:08 GMT

దిశ, కాల్వ శ్రీరాంపూర్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక, మానసిక ఆవేదనకు ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడిన ఘటన మండల పరిధిలోని గంగారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చల్ల సమ్మిరెడ్డి (55) తనకు ఉన్న ఐదెకరా భూమిని ఆర్థిక ఇబ్బందులతో ఇతరులకు అమ్మేశాడు. మరొకరి వద్ద నుంచి ఓ ఎకరం భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలోనే మళ్లీ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో మానసిక వేదన గురైన సమ్మరెడ్డి శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని ప్రభుత్వాసుప్రత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడ చికిత్స కొనసాగుతుండగా సమ్మిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజవర్ధన్ తెలిపారు.

Tags:    

Similar News