బతుకమ్మ చీరల బకాయిలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

పార్లమెంటు ఎన్నికల వేళ సిరిసిల్ల నేతన్నలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది.

Update: 2024-05-10 07:51 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల వేళ సిరిసిల్ల నేతన్నలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. బతుకమ్మ చీరల బకాయిలు మరో 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికుల బతుకమ్మ చీరల బకాయిలు 270 కోట్లకు పైగా పెండింగులో పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల 50 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 100 కోట్ల రూపాయల పెండింగు బిల్లులను విడుదల చేసినట్లు ప్రకటించింది. దీంతో సిరిసిల్ల నేత కార్మికుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపిందని భావిస్తున్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికల పోలింగ్ వేల బకాయిలు విడుదల చేసిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. నేడు మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ పర్యటన నేపథ్యంలోనే పెండింగులో ఉన్న బకాయిలు చెల్లించినట్లు బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ నేతన్నల పెండింగులో ఉన్న బిల్లులను చెల్లించి ప్రభుత్వం మంచి పని చేసిందని జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా బతుకమ్మ చీరల బకాయిల చెల్లింపు బీజేపీకి కొంతవరకు దెబ్బ పడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News