మందుబాబులకు అడ్డగా ఊటూర్ సహకార సంఘం గోదాం..

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ఊటూర్

Update: 2024-04-18 14:30 GMT

దిశ,మానకొండూరు : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ఊటూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ గోదాము, సొసైటీ గోదాం ప్రభుత్వ స్కూల్స్ మందుబాబులకు అడ్డాగా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉంది.పోలీసుల గస్తీ తగ్గిందా, అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గోదాం దగ్గర ఆకతాయిలు, అర్ధరాత్రి వరకు మద్యం సేవిస్తూ, జల్సాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. పోలీస్ గస్తీ లేకపోవడం కూడా వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పోలీసులు రాత్రివేళల్లో వస్తారేమోనని భయం కూడా యువతలో లేదని దీనివల్ల విచ్చలవిడిగా యువత అర్ధరాత్రిల వరకు మద్యం సేవిస్తూ డ్రగ్స్ ,గంజాయి ,బారిన పడుతున్నట్లు,సిగరెట్లు తాగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు కన్నేసి ఆకతాయిలను డ్రగ్స్ బారిన పడకుండా వారిపై చర్యలు తీసుకొని ఇలాంటి ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News