మరోసారి ఔదార్యం చాటుకున్న Etela Rajender

తన నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న 40 మందిని...MLA Etela helps to Huzurbad Constituency People

Update: 2022-12-09 10:06 GMT

దిశ, హుజూరాబాద్: తన నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న 40 మందిని స్వంత ఖర్చులతో చికిత్స చేయించడానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముందుకు వచ్చారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం, జోజునూర్, హుజూరాబాద్ మండలం ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామాలకు చెందిన 40 మందిని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రత్యేక బస్సులో ఆర్వీఎం ఆసుపత్రికి శుక్రవారం తరలించి ఔదార్యం చూపారు. పూర్తి వైద్య ఖర్చులు తానే భరిస్తానని ఈ సందర్బంగా ఈటల మీడియాకు తెలిపారు. ఈటల సూచనతో వ్యాధులతో బాధపడుతున్నవారిని పోతుల సంజీవ్, ముచ్చ సమ్మి రెడ్డి, వేముల హృతిక్, ప్రవీణ్ గ్రామాల నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చి బస్సులో ఆసుపత్రికి తరలించారు. 


Also Read....

స్కాంలకు కేరాఫ్ అడ్రస్‌గా కేసీఆర్ కుటుంబం‌: బండి సంజయ్ 

Tags:    

Similar News