గవర్నర్​కు రైతుల కష్టాలు కనిపించడం లేదా..?

రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు తెలంగాణ గవర్నర్​ తమిళల్ సైకి కనిపించడం లేదా అని రాష్ర్ట బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు

Update: 2023-05-04 13:23 GMT

దిశ, కరీంనగర్​ బ్యూరో: రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు తెలంగాణ గవర్నర్​ తమిళల్ సైకి కనిపించడం లేదా అని రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే గవర్నర్​ రాజకీయాలు మాట్లాడం భాదకరమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​పై ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేయడం కాదని, తెలంగాణలోని రైతుల పక్షాణ గవర్నర్​ మాట్లాడాలని అన్నారు. ఎఫ్​సీఐ నిబంధనలు సడలించాలని, రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన పరిహారానికి మరో రూ. 20వేలు కేంద్రం చెల్లించాలని గవర్నర్​ ప్రధాన మంత్రికి లేఖ రాయాలని గంగుల అన్నారు.

Tags:    

Similar News