ఆగర్భ శ్రీమంతుడుకి భూగర్భ కార్మికుడికి మధ్య ఎన్నిక : కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి ఎంపీ ఎన్నికలు ఆగర్భ శ్రీమంతుడు కి భూగర్భ కార్మికుడికి మధ్య

Update: 2024-05-10 11:34 GMT

దిశ,పెగడపల్లి : పెద్దపల్లి ఎంపీ ఎన్నికలు ఆగర్భ శ్రీమంతుడు కి భూగర్భ కార్మికుడికి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఈ ఎన్నికల్లో కార్మికుల్లో ఒకడినైన నన్ను ఎంపీ గా గెలిపించాలని మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మూడు తరాలుగా పెద్దపల్లి ఓకే కుటుంబం కింద నలిగి పోయిందని ఇన్ని ఎండ్లలో పెద్దపల్లి లో ఒక్క పరిశ్రమ అయిన ఎందుకు ఏర్పాటు చేయలేదు అని ప్రశ్నించారు. మోసపురిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే తెలంగాణలో కష్టాలు మొదలు అయ్యాయని ఎద్దేవా చేశారు.ఎటు చూసినా కరెంట్ కోతలు, వరి కి ఇస్తానన్న బోనస్ అయిదు వందల రూపాయలు ఏమయ్యయని ప్రశ్నించారు.

మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ ఃఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రభుత్వ చీఫ్ విప్ మంత్రిగా నియోజక వర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని ఎంపీగా భారీ మెజారిటీ తో గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తానని కారు గుర్తుకు ఓట్ వేసి ఎంపీ గా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో పి ఏ సి ఎస్ చైర్మన్ ఓరుగంటి రమణ రావు, ఎంపీపీ గోలి శోభ సురేందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, రాష్ట్ర అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఇరుగురాల ఆనందం, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, నాయకులు నరేందర్ రెడ్డి, షేక్ హైదర్,రాజు ఆంజనేయులు,కరుణాకర్ రావు, సాయిని రవీందర్,మడి గెల తిరుపతి,కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర రావు,రాజ శేఖర్ గౌడ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News