మందుబాబులకు అడ్డాగా రైతు వేదికలు

శంకరపట్నం మండల కేంద్రంలో ఒకవైపు

Update: 2024-04-17 10:05 GMT

దిశ,శంకరపట్నం : శంకరపట్నం మండల కేంద్రంలో ఒకవైపు తాసీల్దార్ కార్యాలయం, మరొకవైపు ఎంపీడీవో కార్యాలయం. దాని వెనకే మోడల్ స్కూల్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు మధ్యలో రైతు వేదిక తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలకు పరిష్కరించడం కోసం రైతు వేదికలను ఏర్పాటు చేశారు. కానీ ఆ రైతు వేదికలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. పోలీసుల గస్తీ తగ్గిందా, అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ ఆఫీస్ పక్కనగల రైతు వేదిక దగ్గర ఆకతాయిలు, అర్ధరాత్రి వరకు మద్యం సేవిస్తూ అరుపులు కేకలు పెడుతున్నారని స్థానికులు తెలిపారు. ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ఇటువైపు ఏ ఒక్క పోలీస్ గస్తికి రాడని పోలీసులు వస్తారేమోనని భయం కూడా యువతలో లేదని దీనివల్ల విచ్చలవిడిగా అర్ధరాత్రిల వరకు మద్యం సేవిస్తూ సిగరెట్లు తాగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు తెలిపారు. పోలీసులు కన్నేసి ఆకతాయిల చర్యలను అరికట్టాలని వారు కోరుతున్నారు.

Similar News