హాట్ టాపిక్ గా మారిన కాంగ్రెస్ నాయకుల బహిష్కరణ

హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల బహిష్కరణ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-05-25 15:13 GMT

దిశ,హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల బహిష్కరణ విషయం హాట్ టాపిక్ గా మారింది. హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు పై జమ్మికుంట కు చెందిన కొంతమంది నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డీ అధ్వర్యంలో అసమ్మతి మీటింగ్ పెట్టడమే కాకుండా సోషల్ మీడియా లో ప్రచారం చేయడం జరిగింది.

ఈ విషయం అధిష్టానం సీరియస్ తీసుకుని సమ్మి రెడ్డి కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం,మిగతా వారిని సస్పెండ్ చేయడం హాట్ టాపిక్ గా మారి సోషల్ మీడియాలో వైరల్ అయి చక్కర్లు కొడుతుంది. సమ్మిరెడ్డీ గతం లో పి సిసి మీడియా ఇన్చార్జి గా ఉండడం తో పాటుగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కు సన్నిహితంగా ఉండటం తో నియోజక వర్గంలో తనకు తిరుగు లేదన్న దృక్పథంతో ప్రణవ్ బాబు ను లెక్క చేయక పోవడంతో పాటుగా జిల్లా నాయకులను సైతం పట్టించుకోక పోవడం తదితర విషయాలపై అధిష్టానం సీరియస్ అయి సమ్మె రెడ్డి పై చర్యకు ఆదేశాలు ఇచ్చిందని భావిస్తున్నారు.

Similar News