ప్రమాదం అంచున ఉపాధి పనులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికీ 100 రోజుల ఉపాధి కల్పించేలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనులలో పేదల ప్రాణాలకు విలువ లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి

Update: 2024-05-25 08:56 GMT

దిశ, వేములవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికీ 100 రోజుల ఉపాధి కల్పించేలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనులలో పేదల ప్రాణాలకు విలువ లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పనుల్లో అనుకోని సంఘటనలు జరిగి కూలీల ప్రాణాలు పోతున్న, చాలామంది కూలీలు గాయాలపాలవుతున్న వాటిని అరికట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఇటీవల జిల్లాలోని కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో చోటుచేసుకున్న సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది.

సదరు గ్రామంలో ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీలపై మట్టి పెల్లలు కూలి ఒకరు మృతి చెందగా, మరో 6 మంది గాయపడ్డారు. అయినప్పటికీ ఉపాధీ హమీ కూలీల పని స్థలాల్లో కనీస రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. తాజాగా జిల్లాలోని బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామంలో కూలీలు ప్రమాదం అంచునా, పెద్ద పెద్ద మట్టి కుప్పల ప్రక్కన పని చేస్తున్న వీడియోలు గ్రామానికి చెందిన సీపీఎం నాయకులు గురజాల శ్రీధర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఇవి చూస్తున్నా జిల్లా ప్రజలు ఉపాధిహామీ పనుల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనులకు పోతే నిండు ప్రాణాలు పోయేలా ఉన్నాయంటూ చర్చించుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News