సిరిసిల్లలో దారుణం.. ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం..!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

Update: 2024-05-09 10:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అందులో అతి ముఖ్యమైనది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలంగాణలోని మహిళలందరూ మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలు జీరో టికెట్‌తో ప్రయాణిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులో మహిళల రద్దీ భారీగా పెరిగింది. సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో గాయాల పాలైన వారు కూడా ఉన్నారు. కాగా తాజాగా రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నాగర్‌కు చెందిన ఎక్కల్దేవీ దేవవ్వ(65) వారం కిందట సొంత పని మీద సిరిసిల్లకు వెళ్లింది. అయితే తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల బస్టాండ్‌లో బస్సు ఎక్కే క్రమంలో తోపులాటలో కిందపడి తీవ్ర గాయాలపాలైంది. తీవ్రంగా గాయపడ్డ దేవవ్వను సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మార్గమాధ్యమంలోనే ప్రాణాలు విడిచింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News