దిశ ఎఫెక్ట్.. హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని బుధవారం డీసీహెచ్ (జిల్లా

Update: 2024-05-22 14:33 GMT

దిశ,హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని బుధవారం డీసీహెచ్ (జిల్లా వైద్యశాఖ సూపరిండెంట్ )ఎస్. కృష్ణ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దిశ పత్రికలో మంగళవారం "జీతం ప్రభుత్వానిది.. సేవలు ప్రైవేటుకు" అనే కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆయన ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారా..? లేదా..?అనే విషయమై పలు వార్డులను పరిశీలించారు.ఆస్పత్రి ఏవో డాక్టర్ నారాయణ రెడ్డి, డాక్టర్ సోమశేఖర్ లను ఆసుపత్రికి సంబంధించిన పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వైద్యులు 24 గంటలు ఆస్పత్రిలో అందుబాటులో ఉండాలని అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేయాలని సూచించారు. రోగుల పరిస్థితిని బట్టి సాధ్యమైనంతవరకు ఇక్కడే చికిత్సలు చేయాలని, తప్పనిసరి పరిస్థితిలోనే నిబంధనల ప్రకారం ఎంజీఎంకు గాని, కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. వైద్యులు ఆస్పత్రికి గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిఎం ముజామిల్ ఖాన్, వైద్యులు పి శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ ,సురేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News