ఆ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: సీపీఎం

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో నిర్మాణ చేపడుతున్న చెక్ డ్యాం కాంట్రాక్టర్ పై... Criminal cases should be registered against that contractor: CPM

Update: 2023-02-17 13:17 GMT

దిశ, మంథని: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో నిర్మాణ చేపడుతున్న చెక్ డ్యాం కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ అన్నారు. శుక్రవారం మంథనిలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బగ్గని సుమలత, తన కుమారుడు బక్కని మనోజ్ కుమార్ 2021 సంవత్సరంలో మానేరు వాగుపై నిర్మిస్తున్న చెక్ డాం గుంతల్లో పడి చనిపోవడం జరిగిందన్నారు. ఆ సంఘటన జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటివరకు వారి కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం అందకపోవడం బాధాకరమన్నారు. కాంట్రాక్టర్ ముందస్తు రక్షణ చర్యలు తీసుకోకపోవడమే ఈ సంఘటనకు ప్రధాన కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే ఈ సంఘటనకు జరిగిందని ఆయన మండిపడ్డారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సంఘటనపై సమగ్ర విచారణ జరిపి సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం అందించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. లేనిపక్షంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ సీపీఎం పార్టీ పక్షాన, ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బగ్గని రవి, బగ్గని రాజేశం, బక్కని మణిదీప్ పాల్గొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News