కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కుక్కలతో పోలుస్తుంది: హరీశ్ రావు

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వరి ధాన్యానికి బోనస్ చెల్లించాలని అడిగిన పాపానికి రైతులను కుక్కలతో పొలుస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-05-23 04:51 GMT

దిశ, కొండగట్టు/ కొడిమ్యాల: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వరి ధాన్యానికి బోనస్ చెల్లించాలని అడిగిన పాపానికి రైతులను కుక్కలతో పొలుస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రోజున ఆయనా కొండగట్టు ఆంజనేయస్వామి నీ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో గల వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు,ఈ సందర్భంగా కొనుగోలు జాప్యం పై జాయింట్ కలెక్టర్ తో మాట్లాడి తొందరగా కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు సన్న రకాలకే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమకు మద్దతు తెలుపుతూ అండగా ఉండాలని, అసెంబ్లీలో అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేదాకా రైతుల పక్షాన నిలబడి పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రావి శంకర్, మల్యాల జెడ్పీటీసీ రామ్ మోహన్ రావు,నాయకులు వెంకటేష్,నరేందర్ రెడ్డి,మల్లేశం,తిరుపతి,రమేష్,లక్ష్మ రెడ్డి,స్వామి తదితరులు పాల్గొన్నారు.

Similar News