తాళం వేసిన ఇంట్లో చోరీ

కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి దుండగులు చొరబడి శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు.

Update: 2024-05-25 10:14 GMT

దిశ, కోరుట్ల రూరల్: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి దుండగులు చొరబడి శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కల్లెడ దేవయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి అదే గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్లారు. ఆరోజు రాత్రి దేవయ్య తన కుటుంబ సభ్యులతో అక్కడే గడిపారు. కాగా మరుసటి రోజు ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దేవయ్య ఇంట్లో ఉన్న సుమారు 5 తులాల బంగారంతో పాటు రూపాయలు ఐదువేల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. క్లూస్ టీమ్ తో విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News