హుజురాబాద్ లో పాగా కు బల్మూరి వ్యూహం..?

హుజురాబాద్ లో రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను ఇప్పటి నుంచే ఎమ్మెల్సీ బాల్మూరి వ్యూహం ప్రకారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు పై ఎదురు దాడి చేయిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.

Update: 2024-05-25 13:35 GMT

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ లో రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను ఇప్పటి నుంచే ఎమ్మెల్సీ బాల్మూరి వ్యూహం ప్రకారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు పై ఎదురు దాడి చేయిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. కొంత మంది కార్యకర్తలు జమ్మికుంట మండలం లో మీటింగ్ పెట్టుకుని ప్రణవ్ పై ఆరోపణలు చేయడం వెనుక ఎమ్మెల్సీ హస్తం ఉందని హుజురాబాద్ లో ప్రణవ్ వెన్నంటి ఉండే కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం జరిగిన మీటింగ్ కు వ్యతిరేకంగా ప్రణవ్ కు మద్దతుగా మరో మీటింగ్ పెడదామని అంటే ప్రణవ్ వద్దని చెప్పినట్లు,అది మంచి పద్దతి కాదని చెప్పినట్లు ఆయన అనుచరులు తెలిపారు.

పార్టీలో ముఠా తగాదాలు మంచిది కాదని, అది పార్టీ పై ప్రభావం చూపుతుందని అన్నట్లు తెలిసింది. కాగా ప్రణవ్ బాబు మొన్నటి ఎన్నికల్లో రాజకీయంలో అనుభవమున్న కౌశిక్ రెడ్డి, ఈటెల రాజేందర్ ను తట్టుకుని 55 వేల పై చిలుకు ఓట్లు సాధించడం ఆశామాషి వ్యవహారం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయంలో అనుభవం లేక నియోజక వర్గంలో ఎక్కువగా పరిచయాలు లేకపోవడం, కింది స్థాయి కార్యకర్తలను ఎవరిని నమ్మాల, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి, మరో వైపు పార్టీలోని సీనియర్ నాయకులు వెన్నుపోటు, కోవర్టు రాజకీయం నడిపినా కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం,ప్రణవ్ బాబుపై విశ్వాసం తో అన్ని ఓట్లు వచ్చాయని, కొద్దిగా కష్టపడితే బయట పడే వారమని అభిప్రాయ పడుతున్నారు.

నియోజక వర్గం లో ఇప్పుడిప్పుడే కుదుటపడి రానున్న ఎన్నికల కోసం పార్టీ నీ ఒక రేవు కు తీసుకొస్తున్న సమయంలో అంతర్గతంగా కుమ్ములాట ల పేరిట పార్టీని అప్రదిష్ట పాలు చేయాలని కొంతమంది చూస్తున్నారని, మంత్రి పొన్నం ను సైతం బదునాం చేయాలని చూస్తున్నారని అంటున్నారు. జమ్మికుంట కేంద్రంగా ఈ వ్యతిరేక వర్గం తయారవుతున్నారని, వారు ఈ మధ్యన ఎమ్మెల్సీ వద్దకు పోయి వచ్చిన వారే నని ఆరోపిస్తున్నారు.

ఏది ఏమైనా జమ్మికుంట లో మొదలైన ముసలం అక్కడితో ఆగిపోతుందా ....ఇంకా ముందుకు పోయి ప్రణవ్... బల్మూరి ల మధ్యన ఇంకా పెరుగుతుందా అనే సంశయం కార్యకర్తల్లో ఏర్పడుతున్న దశలో జమ్మికుంటలో మీటింగ్ పెట్టిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మీటింగ్ లో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి కి షోకాజ్ నోటీస్ ఇవ్వటమే కాకుండా వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని తెలపడం జరిగింది. ఈ దశలో తుమ్మేటిని సైతం పార్టీ నుంచి బయటకు పంపడానికి కవ్వంపల్లి తో సహా జిల్లా నాయకులు అంగీకారం తెలిపినట్లు సమాచారం.

మొన్నటి వరకు హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా ఉన్న సమయంలో పార్టీకి చిన్న వాడైనా పెద్ద దిక్కులా ఉన్న ప్రణవ్ బాబు పై ఓ వర్గం కావాలని పథకం ప్రకారం దాడి చేస్తూ పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని, ప్రణవ్ కంటే ముందు పోటీ చేసిన నాయకునికి కేవలం 3 వేల ఓట్లు వచ్చిన విషయం మరిచిపో లేమని, పార్టీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న వారిని ఎవరిని సహించేది లేదని కింది స్థాయి కార్యకర్తలకు సందేశం పంపుతూ పార్టీ వ్యతిరేక సమావేశం పెట్టిన వారిని పార్టీ నుంచి బయటికి పంపడం ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదనే ఉద్దేశ్యం తోనే నని అంటున్నారు.

ఏది ఏమైనా ప్రణవ్ బాబు కు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టిన వారిని గుర్తించి బయటికి ఓకె రోజు లోర్టీ నుంచి బయటకి పంపడం వెనుక వారి పై చాలా రోజుల నుండి నిఘా ఉందని, పార్టీ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి పార్టీని నాశనం చెయ్యాలనే ఉద్దేశ్యం, బ్లాక్ మెయిల్ రాజకీయం తదితర కారణాల పై పార్టీ కి గత కొన్ని రోజులుగా పిర్యాదులు, నియోజకవర్గ ఇన్చార్జి గా ప్రణవ్ బాబుకు విలువ ఇవ్వక పోవడం,తామే పార్టీలో సీనియర్ లం అనే అహంకారం తో లెక్క చేయక పోవడం తదితర కారణాలతో వీరిని పార్టీ నుంచి బయటకు పంపితే జిల్లాలో మరెవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడ కూడద నే సందేశాన్ని ఇచ్చిన వారమవుతామనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది.

Similar News