ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి వద్ద టీవీఎస్ ఎక్సెల్‌ను ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇల్లంతకుంట మండలం శ్రీరాముల పల్లికి చెందిన గుత్తికొండ తిరపతమ్మ

Update: 2023-03-06 07:02 GMT

దిశ, జమ్మికుంట :  జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి వద్ద  టీవీఎస్ ఎక్సెల్‌ను  ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇల్లంతకుంట మండలం శ్రీరాముల పల్లికి చెందిన గుత్తికొండ తిరపతమ్మ అక్కడికక్కడే మరణించింది. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ట్రాక్టర్ ఓ వర్ స్పీడే కారణం అంటున్నారు స్థానికులు. ఇక ఈ అక్రమ ఇసుక రవాణా పట్టించుకోవాల్సిన అధికారులు, వారితోనే చేతులు కలుపుతున్నారని, అందుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. 

Tags:    

Similar News