ధాన్యం లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా

మండల పరిధిలోని కోజన్ కొత్తూరు గ్రామ శివారులో ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

Update: 2023-06-06 11:04 GMT

దిశ, ఇబ్రహీంపట్నం : మండల పరిధిలోని కోజన్ కొత్తూరు గ్రామ శివారులో ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. యమాపూర్ సింగిల్ విండో అధ్యర్యంలో ఏర్పాటు చేసిన కోజన్ కొత్తూర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మంగళవారం బస్తాలను లారీలో లోడ్ చేసి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు.

Tags:    

Similar News