డిఎంహెచ్ఓ వేధింపుల వల్లే 104 డ్రైవర్ రాజు మృతి

జగిత్యాల డిఎం&హెచ్ఓ పుప్పాల శ్రీధర్ వేధింపుల కారణంగానే 104 డ్రైవర్ రాజ్ కుమార్ మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతోపాటు 104 ఉద్యోగులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన తెలిపారు.

Update: 2024-05-25 11:49 GMT

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల డిఎం&హెచ్ఓ పుప్పాల శ్రీధర్ వేధింపుల కారణంగానే 104 డ్రైవర్ రాజ్ కుమార్ మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతోపాటు 104 ఉద్యోగులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… డ్రైవర్ అయిన రాజ్ కుమార్ తో వ్యక్తిగత పనులు చేయించుకునే వాడని ఆరోపించారు.104 లేడి వింగ్ జనరల్ సెక్రటరీ హేమలత మాట్లాడుతూ.. గత మూడు నెలల నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్ లో రాజ్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్నాడని తెలిపారు. అయితే మూడు రోజుల నుంచి కంటిన్యూగా డ్యూటీ చేయించడంతోనే అస్వస్థతతో గుండెపోటుకు గురయ్యాడని అన్నారు.

అయితే రాజ్ కుమార్ మృతికి డిఎంహెచ్ఓ శ్రీధర్ కారణమని, తాను ఇంత దూరం వచ్చి పని చేయాలేనని మొర పెట్టుకున్నప్పటికీ పట్టించుకోలేదన్నారు. కేవలం జగిత్యాల లోనే కాకుండా ఇతర జిల్లాల లోనూ 104 సిబ్బంది వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలల నుంచి జీతాలు కూడా రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే 104 డ్రైవర్ రాజ్ కుమార్ మృతికి కారణమైన డిఎంహెచ్ఓ పుప్పాల శ్రీధర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులతోపాటు 104 ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Similar News