బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం..

తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. హైదరాబాద్‌లోని గూగి రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ అధికారులు మంగళవారం రైడ్స్ నిర్వహించారు.

Update: 2023-02-28 02:37 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రియల్ ఎస్టేట్ కంపెనీలే లక్ష్యంగా ఆదాయం పన్ను (ఐటీ) అధికారులు హైదరాబాద్‌లో మరోసారి దాడులు జరిపారు. తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీ బంధువు అక్బర్‌కు చెందిన గూగీ రియల్ ఎస్టేట్ సంస్థలో మంగళవారం ఐదు ప్రత్యేక బృందాలు సోదాలు జరిపాయి. దిల్‌సుఖ్ నగర్ కొత్తపేటలోని గూగీ రియల్ ఎస్టేట్ హెడ్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. గూగీ రియల్ ఎస్టేట్ సంస్థ వేర్వేరు చోట్ల రాయల్ సిటీ, వండర్ సిటీ, ఫార్మా సిటీ పేర్లతో పలు ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోన్నట్లు సమాచారం. ఇక, మరికొన్ని ఐటీ అధికారుల బృందాలు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లోనూ రైడ్స్ నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఐటీ అధికారులు మొత్తం 20 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. 

Also Read...

మంత్రి VS అసంతృప్త నేతలు.. అధికార పార్టీలో భగ్గుమన్న విబేధాలు 

Tags:    

Similar News