బ్రేకింగ్: హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసులకు GHMC కీలక సూచన!

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం నగరంలోని సరూర్ నగర్, చంపాపేట్, సైదాబాద్, సంతోష్ నగర్, హిమాయత్ నగర్, అబిడ్స్, మలక్ పేట్

Update: 2023-05-09 14:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం నగరంలోని సరూర్ నగర్, చంపాపేట్, సైదాబాద్, సంతోష్ నగర్, హిమాయత్ నగర్, అబిడ్స్, మలక్ పేట్, చాదర్ ఘాట్, మెహాదీపట్నం, మాసబ్ ట్యాంక్, కార్వాన్, మల్లేపల్లి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఫిల్మ్ నగర్, కాటేదాన్, రాజేంద్ర నగర్, అత్తాపూర్, కాటేదాన్, ఆరాంఘర్, మైలార్ దేవ్ పల్లి, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

సరిగ్గా ఆఫీస్‌ల నుండి ఇంటికి వెళ్లే సమయంలోనే వర్షం పడటంతో ఉద్యోగస్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం వల్ల రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ నగరవాసులకు కీలక సూచన చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. 

Tags:    

Similar News