బీఆర్ఎస్ పార్టీ ఉండదని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదు!.. విజయశాంతి ట్వీట్ పై నెటిజన్లు ట్రోలింగ్

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి అన్నారు.

Update: 2024-05-17 07:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి అన్నారు. తెలంగాణ బీజేపీ అద్యక్షుడు కిషన్ బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణల బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అని తెలిపారు. ఇది అర్థం కాని వారు.. కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలితల నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ ఇచ్చిన రాజకీయ సమాధానం ఇప్పడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

దక్షిణాది ఆత్మగౌరవం ఉందన్న సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చేయలేదని కిషన్ రెడ్డి మాటల ద్వారా తెలుస్తుందన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతగా ఉన్న విజయశాంతి బీఆర్ఎస్ పై చేసిన విమర్శలకు స్పందించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. దక్షిణాది ఉన్న ప్రేమతో కౌంటర్ ఇచ్చారా? లేక కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభించట్లేదని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనేది ప్రశ్నార్ధకం అయ్యింది. ఇక విజయశాంతి ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకైనా తెలుసా? అని, మూలాలు గుర్తుకు వచ్చి మళ్లీ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ కు పోతున్నావా సూచనలు అలాగే ఉన్నాయని, నువ్వు కూడా చిరంజీవి గారి లాగా సైడ్ అయిపోతే బాగుంటుంది అక్క అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. 


Similar News