తెలుగు విశ్వవిద్యాలయంలో దూర విద్యా కోర్సులకు ఆహ్వానం

పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022, 23 విద్యా సంవత్సరానికి దూర విద్య కేంద్రం ద్వారా నిర్వహించే పలు కోర్సులకు ప్రవేశ ప్రకటనను విడుదల చేయనున్నట్లు దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పీహెచ్ పద్మప్రియ ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2022-12-27 14:07 GMT

దిశ, అంబర్ పేట్: పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022, 23 విద్యా సంవత్సరానికి దూర విద్య కేంద్రం ద్వారా నిర్వహించే పలు కోర్సులకు ప్రవేశ ప్రకటనను విడుదల చేయనున్నట్లు దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పీహెచ్ పద్మప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది విశ్వవిద్యాలయం సంబంధించిన పలు కోర్సులకు పీజీ, డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశానికి ఆసక్తిగల విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తులు డిసెంబర్ 28వ నుంచి ఫిబ్రవరి 28 వరకు సంబంధిత రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదనపు రూ200/- చెల్లించి మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు www TeluguUniversity.ac.in ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News