బైపీసీ విద్యార్థులకు అలర్ట్.. TSRTC నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ల కోసం అప్లికేషన్స్‌ను ఆహ్వానించింది.

Update: 2023-05-26 13:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ల కోసం అప్లికేషన్స్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు ఎండీ సజ్జనర్ ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. మేనేజ్మెంట్ కోటా(2023- 2024) బీఎస్సీ నర్సింగ్ కోర్సులో సీట్ల కొరకు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు తార్నకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలోని సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. నాలుగేళ్ళ ఈ కోర్సులో చేరడానికి ఇంటర్ బైపీసీ ఉతీర్ణులై, 17 ఏళ్లు నిండిన విద్యార్థినులు అర్హులు. ఈ మేరకు ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Tags:    

Similar News