Health: హోటల్లో తినడం అంటే డబ్బులు ఇచ్చిమరీ రోగాలను కొనుకున్నట్టే.. తనిఖీల్లో షాకింగ్ విషయాలు

హైదరాబాద్ చారిత్రాత్మక కట్టడాలకే కాదు, నోరూరించే వంటకాలకు సైతం ప్రసిద్ధిగాంచింది.

Update: 2024-05-25 09:05 GMT

దిశ వెబ్ డెస్క్: హైదరాబాద్ చారిత్రాత్మక కట్టడాలకే కాదు, నోరూరించే వంటకాలకు సైతం ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనితో వీకెండ్ అయినా, పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలైనా, కారణం ఏదైనా చలో రెస్టారెంట్ అనే వాళ్లు ఎందరో ఉన్నారు.

అయితే రెస్టారెంట్లలో సిట్టింగ్ ఏరియా ఉన్నంత శుభ్రంగా కుకింగ్ ఏరియా సైతం ఉంటుందని, పరిశుభ్రమైన తాజా వంటలనే మనకి అందిస్తారు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. గత నెల రోజుగా GHMC టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికి పది రెస్టారెంట్లల్లో తనిఖీలు చేయగా, నాలుగు రెస్టారెంట్లల్లో ఎక్స్‌పైర్ అయిన పాల ప్యాకెట్లు, పాడైపోయిన వంట సరుకులు, లేబుల్ లేని వస్తువులు, చింతపండు, గోదుమ పిండి, మైదా వంటి వాటిల్లో పురుగులు, వంట గదిలో కుప్పలుతెప్పలుగా బొద్దింకలు బయటపడ్డాయి.

అలానే ఆహారపదార్థాలను నిల్వ చేయడంలోనూ నిబంధనలను పాటించడం లేదు. ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సి వస్తే కవర్లో పెట్టి నిల్వచేయాలి. కాని అలా చేయడం లేదు. అలానే చికిన్, మటన్, శాకాహార పదార్ధాలను పక్కపక్కనే పేడుతున్నారు. మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టి ఆర్డర్ వచ్చినప్పుడు వేడిచేసి ఇస్తున్నారు.

కాగా కుల్లిపోయిన కూరగాయలు, బూజు పట్టిన ముడిసరుకులు తనిఖీల్లో బయటపడ్డాయి. దీనితో కొందరిపై క్రమినల్ కేసలు నమోదు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందం మరికొందరికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతోపాటుగా జరిమానా విధించారు. 

Similar News