ఆ విషయాన్ని వారు ఒప్పుకుంటే, నేను పోటీ నుండి తప్పుకుంటా!.. ఎమ్మెల్సీ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణను దోచుకుంది మేఘా కృష్ణారెడ్డి అని రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే తాను పోటీ నుండి తప్పుకొని తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలుస్తానని కాంగ్రెస్ భహిష్కృత నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-22 09:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణను దోచుకుంది మేఘా కృష్ణారెడ్డి అని రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే తాను పోటీ నుండి తప్పుకొని తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలుస్తానని కాంగ్రెస్ భహిష్కృత నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణంలోని లైబ్రరీ లో పర్యటించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ కుంగుబాటుపై మూడు సమావేశాలు జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కుంగుబాటుకు కారణం ఎల్అండ్‌టీ అని చెప్పారే తప్ప మేఘా కృష్ణారెడ్డి పేరు తీసే దమ్ము ఏ ఒక్కరికి లేదని ఆరోపణలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏ ఒక్క నాయకుడైన దానికి కారణం మేఘా కృష్ణారెడ్డి అని చెబితే నిరుద్యోగుల సాక్షిగా తాను ఎన్నికల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. మేఘా కృష్ణారెడ్డి ఓ దొంగ అని, కాళేశ్వరం పేరుపై లక్ష 50 వేల కోట్లు దోచుకున్నాడని, మిషన్ భగీరథ పేరుతో 45 వేల కోట్లు దోచుకున్నాడని, మా బడి మా ఊరు కార్యక్రమంపై లక్షల కోట్లు దోచుకున్నాడని, ఆయనపై ఎంక్వైరీ వేస్తామని తీన్మార్ మల్లన్న కానీ, రేవంత్ రెడ్డి కానీ ఒక్క స్టేట్ మెంట్ ఇస్తే మరు క్షణం తాను ఎన్నికల నుంచి తప్పుకొని తీన్మార్ మల్లన్నకు మద్దత్తుగా ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. కాగా కాంగ్రెస్ బహిష్కృత నేత అయిన బక్కా జడ్సన్ నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. 

Similar News