భార్యను ఇంటికి పంపటంలేదు అని మామ పై అల్లుడు హత్యాయత్నం

తన భార్యను ఇంటికి పంపటంలేదు అని మామ పై అల్లుడు హత్యాయత్నం చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది

Update: 2024-05-24 14:09 GMT

దిశ, జూబ్లిహిల్స్: తన భార్యను ఇంటికి పంపటంలేదు అని మామ పై అల్లుడు హత్యాయత్నం చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ , పాలకొల్లు ప్రాంతానికి చెందిన రామారావు (65) అనే వ్యక్తి కూతురుతో అల్లుడు సుబ్రహ్మణ్యం (30) కి వివాహం జరిగింది. వీరు ఇరువురు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని యాదగిరి నగర్ లో నివాసం ఉంటున్నారు.

అయితే కొన్ని రోజులుగా సుబ్రహ్మణ్యం భార్య పుట్టింటి దగ్గర నుండి సుబ్రహ్మణ్యం (అత్తింటికి) రావడంలేదని, ఆగ్రహానికి లోనైన సుబ్రహ్మణ్యం , భార్యని ఇంటికి పంపించటం లేదని తన మామ పై కోపం తో శుక్రవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో యాదగిరి నగర్ లోని మామ ఇంటికి వెళ్లి మామ రామారావు (65) పై బ్లేడ్ తో మెడ మీద కోసి, హత్యాయత్నంకి ప్రయత్నించాడు. అప్రమత్తం అయిన కుటుంబ సభ్యుల రాక తో రామారావుని ఆసుపత్రికి తరలించి, మధురా నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు సుబ్రహ్మణ్యంని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News