మూసినది, ఔటర్ రింగ్ రోడ్‌ను అభివృద్ధి చేయడం నా బాధ్యత : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించే మజ్లిస్ పార్టీకి ఓటు వేస్తారా...

Update: 2024-05-10 16:37 GMT

దిశ, కార్వాన్ : హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించే మజ్లిస్ పార్టీకి ఓటు వేస్తారా... లేక వ్యాపారాలు అభివృద్ధి చేసే కాంగ్రెస్ కు ఓటు వేస్తారో ప్రజలు తేల్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి గోషామహల్ నియోజకవర్గం లోని బేగంబజార్ చత్రి వద్ద కాంగ్రెస్ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీర్ ఉల్లి ఉల్లా తో కలిసి రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ... హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సమీర్ ఉలి ఉల్లా ఖాన్ ను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని అన్నారు.నగరం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ని గెలిపించాలన్నారు. మూసినది, ఔటర్ రింగ్ రోడ్ ను అభివృద్ధి చేయడం తన బాధ్యత అని తెలిపారు. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని కోరారు. భాజపా, మజ్లిస్ రెండు పార్టీలు మతం పేరుతో ఎన్నికల్లో ప్రజల మధ్య చిచ్చురేపుతూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల తో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు.

గత 40 ఏళ్లుగా ఉన్న మజ్లిస్ అధినేత, ఎంపీ పాత నగరాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని విమర్శించారు. భాజపా తెలంగాణలో అల్లర్లు సృష్టించి తెలంగాణలో ఉన్న ఐటీ కంపెనీలు గుజరాత్ తరలించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అన్ని కుట్రలు ఛేదించాలంటే రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిపించాలని ప్రజలకు కోరారు. ప్రజలకు ఆరు గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు. గ్యాస్ ఉచిత బస్సు ప్రయాణం, పది లక్షల ఆరోగ్యశ్రీ తో ఇప్పటికే ప్రజలు లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ రోడ్ షోలో గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నందకిషోర్ వ్యాస్, సంజయ్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్,శ్రీధర్ గౌడ్, మమత గుప్తా, పురుషోత్తం, ఆశిష్, పెద్ద ఎత్తున నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News