ఓయో లాడ్జిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద మృతి

ఓయో లాడ్జిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-05-26 11:42 GMT

దిశ, శేరిలింగంపల్లి : ఓయో లాడ్జిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా రాయచోటి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన తుర్ల జయప్రకాష్ నారాయణ(35 ) కుటుంబ సభ్యులతో కలిసి కూకట్ పల్లి బాలాజీనగర్ లో నివసిస్తున్నాడు. నిన్న ఉదయం నుంచి కనపడకుండా పోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ మిస్సింగ్ కేసు నమోదు అయింది. అయితే

శనివారం రాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడకు చేరుకున్న ఆయన ఓ ఓయో లాడ్జి రూమ్ నెంబర్ 301 గది అద్దెకు తీసుకున్నాడు. రాత్రి రూమ్ లో పడుకున్న నారాయణ ఆదివారం ఉదయం క్లీనింగ్ బాయ్ వెళ్లి గది శుభ్రం చేసేందుకు డోర్ కొట్టినా గది తలుపులు తెరవకపోవడంతో ఓయో లాడ్జి నిర్వాహకులకు తెలిపాడు. వారు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా జయప్రకాష్ నారాయణ గదిలో మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని జయప్రకాష్ నారాయణది హత్యా, ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Similar News