'రాన్' లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ల సందడి

సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ కు చెందిన స్టార్ క్రికెటర్లు కొండాపూర్‌ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఉన్న ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ 'రాన్' లో మంగళవారం సందడి‌‌ చేశారు.

Update: 2024-04-30 11:50 GMT

దిశ, శేరిలింగంపల్లి : సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ కు చెందిన స్టార్ క్రికెటర్లు కొండాపూర్‌ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఉన్న ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ 'రాన్' లో మంగళవారం సందడి‌‌ చేశారు. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ రాన్ కు అధికారిక భాగస్వామి. స్టార్ క్రికెటర్లు ‌హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్, టి.నటరాజన్‌ లు అభిమానులతో ఆత్మీయంగా మాట్లాడారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు. అనంతరం క్రికెటర్లు షాపింగ్ చేశారు. తమకు కావాల్సిన దుస్తులు తీసుకున్నారు. క్రికెటర్లు షాపింగ్ కు విచ్చేశారని తెలియడంతో క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతం సందడిగా మారింది. అభిమానులతో రాన్ కిక్కిరిసిపోయింది. తమ అభిమాన క్రికెటర్లను చూసి పులకించిపోయారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.  


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News