జూన్ 3 నుంచి ఎస్ఎస్ సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు..

జూన్ 3 నుంచి 13 వరకు పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి ఆర్.రోహిణి ఒక ప్రకటన తెలిపారు.

Update: 2024-05-24 12:46 GMT

దిశ, ఖైరతాబాద్ : జూన్ 3 నుంచి 13 వరకు పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి ఆర్.రోహిణి ఒక ప్రకటన తెలిపారు. జూన్ 3న ఫస్ట్ లాంగ్వేజ్( గ్రూప్ ఏ), పార్ట్ I ( కాంపోజిట్ కోర్స్ ), పార్ట్ II కాంపోజిట్ కోర్స్,జూన్ 5న సెకండ్ లాంగ్వేజ్, జూన్ 6న ఇంగ్లీష్,జూన్ 7న మ్యాథమెటిక్స్, జూన్ 8న సైన్స్ పార్ట్ I ఫిజికల్ సైన్స్, జూన్ 10న సైన్స్ పార్ట్ II బయలోజికల్ సైన్స్, జూన్11 న సోషల్ స్టడీస్, జూన్ 12న ఓఎస్ఎస్ సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ఐ ( సంస్కృత్ , అరబిక్) జూన్ 13న ఓఎస్ఎస్ సి పేపర్ II (సాంస్కృత్ , అరబిక్) పరీక్షలను ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 35 పరీక్షా కేంద్రాల్లో 12186 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని ఆమె తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా విద్యా అధికారి ఆర్ రోహిణి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Similar News