కామాటిలతో ఓటర్ల జాబితా పరిశీలన

ఉదయం లేవగానే ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే కామాటిలతో ఓటర్ల జాబితా పరిశీలన చేయించడం ఎంత వరకు సమంజసమని చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.వెంకటేష్ జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు.

Update: 2023-05-31 14:11 GMT

దిశ, చార్మినార్ : ఉదయం లేవగానే ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే కామాటిలతో ఓటర్ల జాబితా పరిశీలన చేయించడం ఎంత వరకు సమంజసమని చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.వెంకటేష్ జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు. బుధవారం మొఘల్ పురా జీహెచ్ఎంసీ సర్కిల్ 9 కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ ఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న బీఎల్ ఓలలో సుమారు ఇరవై మంది వరకు కామాటిలు కనిపించడంతో వెంకటేష్ అధికారులను నిలదీశారు.

     అక్కడ ఉన్న కామాటిలను అందరిని పిలిచి వారి దగ్గర ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించారు. కనీసం వారి పేరు కూడా రాయడం రాని కామాటిలను బీఎల్ ఓ లుగా నియమించి ఓటరు జాబితాలను వారి చేతికి ఇచ్చి ఇంటింటికీ వెళ్లి పరిశీలించడం ఏమిటని వెంకటేష్ అధికారులను ప్రశ్నించారు. గతంలో ఆశా వర్కర్లతో ఓటర్ల జాబితా పరిశీలన ఏవిధంగా పరిశీలన చేయంచారో అదే పద్దతిలో మరలా ఓటరు జాబితా పరిశీలనను ఆశా వర్కర్లతో చేయించాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సర్కిల్ 9 డిప్యూటీ కమిషనర్ సూర్య కుమార్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

Similar News