ఎన్నికల రోజున ఉచిత రైడ్‌లను అందించనున్న రాపిడో

దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్టం చేయాలనే దృఢ సంకల్పంతో

Update: 2024-05-06 13:06 GMT

దిశ,హైదరాబాద్ బ్యూరో : దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్టం చేయాలనే దృఢ సంకల్పంతో భారతదేశపు అగ్రగామి ప్రయాణ యాప్ రాపిడో, "సవారీ బాధ్యత" కార్యక్రమం ప్రారంభించడం తో జాతీయ విధిలో కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది. తెలంగాణ ప్రధాన ఎన్నికల కార్యాలయం సహకారంతో, భారత సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా పౌర స్పృహ కలిగించటం ద్వారా ఛాంపియన్‌గా నిలవటానికి రాపిడో సంకల్పించింది . ఈ చారిత్రాత్మక ప్రయత్నంలో భాగంగా రాపిడో హైదరాబాద్ అంతటా ఓటర్లకు ఉచిత బైక్ టాక్సీ, ఆటో , క్యాబ్ రైడ్‌లను అందజేస్తామని హామీ ఇవ్వటంతో పాటుగా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం , వరంగల్ వంటి ప్రధాన నగరాలలో పోలింగ్ రోజైన ఈ నెల 13 న ఈ సేవలను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా, అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో ఓటు వేయడానికి ప్రజలను మరింత ప్రోత్సహించడానికి రాపిడో ఇప్పుడు తెలంగాణ ప్రధాన ఎన్నికల కార్యాలయంతో చేతులు కలుపుతోంది. ఇందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఓటరుపై అవగాహన కల్పించేందుకు రాపిడో కార్యక్రమాన్ని నిర్వహించింది.ఇందులో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హాజరయ్యారు.

ఉచిత రైడ్ పొందడం ఎలా ...?

ఎన్నికల రోజున ఓటర్లు ఓట్ నౌ (VOTENOW) కోడ్‌ని ఉపయోగించి రాపిడో యాప్‌లో ఉచిత రైడ్‌లను పొందవచ్చు . తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి ఉచిత రైడ్‌ను పొందవచ్చు. దేశ వాసుల ఓటింగ్ హక్కులను సులభతరం చేయడం , సమగ్ర ఎన్నికల ప్రక్రియను నిర్ధారించడం ఈ కార్యక్రమ లక్ష్యమని సంస్థ ప్రకటించింది . ఎన్నికల రోజున ఉచిత రైడ్‌లను అందించడానికి 100 కంటే ఎక్కువ నగరాల్లో 10 లక్షల మంది కెప్టెన్‌లను మోహరించినట్లు వెల్లడించింది.

మార్పు తీసుకువచ్చే ప్రయత్నం.. : రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి

తెలంగాణ ప్రధాన ఎన్నికల కార్యాలయంతో రాపిడో భాగస్వామ్యం మెరుగైన సమాజం కోసం సానుకూల మార్పును తీసుకొచ్చే బ్రాండ్‌గా దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుందని రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి అన్నారు . ఈ మేరకు ఆయన మాట్లాడుతూ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లోని ప్రతి ఓటరు 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు వేయడం ద్వారా తమ పౌర కర్తవ్యాన్ని విజయవంతంగా నెరవేర్చేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాదులోని ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చూడటం కోసం మా వద్ద ఉన్న వనరులు అన్ని వినియోగిస్తున్నాము. దివ్యాంగులు , సీనియర్ సిటిజన్ ఓటర్లు కు ఉచిత ఆటో మరియు క్యాబ్ రైడ్‌లను విస్తరింపజేయడం ద్వారా వారి ప్రజాస్వామిక హక్కును సరిగా వినియోగించుకునేలా తోడ్పడుతున్నామని చెప్పారు.

అభినందించిన రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్..

రాపిడో తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ అభినందించారు . ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్లకు ఉచిత రైడ్‌లను అందించడానికి రాపిడో చేపట్టిన కార్యక్రమం ఓటరు భాగస్వామ్యాన్ని, యాక్సెసబిలిటీని ప్రోత్సహించేకు ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు . ఓటర్లకు ప్రత్యేకించి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్‌లకు ఉచిత ప్రయాణాన్ని అందించడం ద్వారా, రాపిడో మరింతగా చేరికను సులభతరం చేస్తుందన్నారు . అర్హత కలిగిన ప్రతి పౌరుడు వారి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోగలరనే భరోసా అందిస్తుందని అన్నారు. ఓటర్లందరూ తమ ఓటు వేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు .

Similar News