560 గ్రాములతో పుట్టిన పాపకు ట్రీట్మెంట్ నిర్వహించిన నీలోఫర్ వైద్యులు...

560 గ్రాములతో పుట్టిన పాపకు ట్రీట్మెంట్ నిర్వహించి నీలోఫర్ వైద్యులు చిన్నారిని కాపాడారు.

Update: 2024-05-23 14:47 GMT

దిశ,కార్వాన్ : 560 గ్రాములతో పుట్టిన పాపకు ట్రీట్మెంట్ నిర్వహించి నీలోఫర్ వైద్యులు చిన్నారిని కాపాడారు. అదిలాబాద్ ప్రాంతానికి చెందిన ముస్కాన్ రిజ్వాన్ దంపతులకు రెండు నెలల క్రితం పాప 560 గ్రాములతో 27 వారాలకే జన్మించింది. ఈ క్రమంలో నీలోఫర్ ఆస్పత్రిలో రెండు నెలల పాటు వైద్యుల బృందం చిన్నారిని చికిత్సలు నిర్వహించి ప్రస్తుతం పాప బరువు కిలో 465 గ్రాముల బరువు ఉంది. బేబీ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో బేబీని బుధవారం డిశ్చార్జి చేశారు. బేబీకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు స్వప్న, అలివేలు, సురేష్ తో పాటు జూనియర్ డాక్టర్స్ లను నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ టి. ఉషారాణి అభినందించారు.

Similar News