కిషన్ రెడ్డిని సీఎం చేయాలి: MP Soyam Bapurao

కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవిపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కీలక వ్యాఖ్యలు చేశారు. ...

Update: 2023-07-21 10:30 GMT

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవిపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిని సీఎంను చేయాలని ఆయన ఆకాంక్షించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలకు వెళ్తున్న కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. బీజేపీ అందుకు బదులు తీర్చుకోవాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు బాపురావు సూచించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో బాపురావు మాట్లాడుతూ తన పార్లమెంట్ పరిధిలోని 7 సీట్లలో బీజేపీ గెలుపు జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి రాష్ట్ర నాయకులు కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు. పాత, కొత్త నాయకులందరూ కలిసికట్టుగా పని చేసి బీఆర్ఎస్‌ను ఓడించాలని బాపురావు పిలుపు నిచ్చారు.

Read more : disha newspaper


Tags:    

Similar News