మురుగునీరు మల్లింపు కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులలో భాగంగా రూ. 7 కోట్ల 73 లక్షల

Update: 2024-05-24 14:57 GMT

దిశ, శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులలో భాగంగా రూ. 7 కోట్ల 73 లక్షల అంచనా వ్యయంతో చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు కాల్వ నిర్మాణం పనులను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైశాలి నగర్ నుండి ఈర్ల చెరువు అలుగు వరకు డ్రైనేజి వ్యవస్థ మల్లింపు కాల్వ నిర్మాణం పనులలో వేగం పెంచాలని, పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అన్నారు.

త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. చుట్టుపక్కల కాలనీల నుండి వచ్చే మురుగు నీరు చెరువులో కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలకు చెరువు చుట్టుపక్కల నివసిస్తున్న కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మురుగు నీటి కాల్వ పై స్లాబ్ లు వేయాలని, ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, బాబుమోహన్ మల్లేష్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News