BREAKING: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వెదర్.. పలు చోట్ల వర్షం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆదివారం ఉదయం నుండి ఎండ దంచికొట్టగా సాయంత్రానికి వెదర్ ఒక్కసారిగా

Update: 2024-05-26 10:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆదివారం ఉదయం నుండి ఎండ దంచికొట్టగా సాయంత్రానికి వెదర్ ఒక్కసారిగా చల్లబడింది. దట్టమైన మబ్బులు అలుముకోవడంతో ఆకాశం మేఘావృతమైంది. ఈ క్రమంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌, పెద్ద అంబర్ పేట్‌లో భారీ ఈదురు గాలులుతో కూడిన వాన పడుతోంది. సిటీలోని వనస్థలిపురం, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడ, కాచిగూడ, నల్లకుంట, మన్సురాబాద్, మల్కాజిగిరి, తుర్కయాంజాల్‌తో పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఆదివారం కావడంతో వీకెండ్ ఎంజాయ్ చేద్దామని సరదాగా బయటికొచ్చిన నగరవాసులు ఒక్కసారిగా కురుస్తోన్న వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Similar News