ఆ పకోడి తిన్నారంటే ఏకంగా పైకే.. పట్నంలో సచ్చిన కోళ్లతో ఫ్రైలు

మహానగర వాసులారా జాగ్రత్త.. మంసాహార ప్రియులారా తస్మా్త్ జాగ్రత్త.. రోడ్డు సైడ్ ఘుమఘుమలతో తక్కువ ధరకే చికెన్ పకోడి వస్తుందని ఎగబడి తింటే పైకి వెళ్లడం ఖాయం.

Update: 2024-05-22 16:21 GMT

దిశ, సిటీ బ్యూరో: మహానగర వాసులారా జాగ్రత్త.. మంసాహార ప్రియులారా తస్మా్త్ జాగ్రత్త.. రోడ్డు సైడ్ ఘుమఘుమలతో తక్కువ ధరకే చికెన్ పకోడి వస్తుందని ఎగబడి తింటే పైకి వెళ్లడం ఖాయం. నగరంలో అంబర్‌పేట, నాంపల్లి, ముర్గీ మార్కెట్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో కొన్ని చికెన్ సెంటర్లు చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లలో చికెన్ ఐటమ్స్ తీసుకున్నా.. ఫుడ్ రూ.400, సింగిల్ రూ.200లకు తక్కువ రాదు. కానీ, ఈ మధ్య రోడ్డు సైడ్ చిన్న చిన్న తోపుడు బండ్లపై, వైన్ షాపుల పర్మిట్ రూమ్‌ల వద్ద వెలుస్తున్న చికెన్ పకోడి సెంటర్లు కేవలం రూ.50‌కే సింగల్ చికెన్ పకోడి, రూ.‌80 నుంచి రూ.100కే ఫుడ్ ప్లేట్ చికెన్ పకోడిని విక్రయిస్తున్నారు.

ఈ సెంటర్ల నిర్వాహకులు ఆయా చికెన్ సెంటర్లలో విక్రయిస్తున్న చనిపోయిన చికెన్ తోనే పకోడి చేసి, విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి చికెన్ అయినా70 డిగ్రీల కన్నా ఎక్కువ సెంటగ్రేడ్ల వేడిలో ఉడికిపోవటంతో పాటు వాటిలో ఏదైన బ్యాక్టీరియా ఉన్నా, నాశనం అవుతుందని, కానీ, చిన్న చిన్న తోపుడు బండ్లపై సచ్చిన కోడి మాంసంతో తయారు చేసిన చికెన్ పకోడి ఆరోగ్యానికి చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కేవలం పేరుగాంచిన బడా ఆహార విక్రయ కేంద్రాలపైనే గాక, ప్రజారోగ్యానికి ముప్పు తెస్తున్న ఇలాంటి చికెన్ పకోడి సెంటర్లపై కూడా ఫుడ్ సేఫ్టీ దృష్టి సారించాల్సిన అవసరముందని నగరవాసు అంటున్నారు.

Similar News