ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం నగరంలో భారీ ఏర్పాట్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

Update: 2024-05-26 09:42 GMT

దిశ, శేరిలింగంపల్లి : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కోల్ కత్తా వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరగనున్న ఫైనల్ మ్యాచ్ ను దృష్టిలో ఉంచుకుని పలు హోటళ్లు, పబ్ లు, రెస్టారెంట్లలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. దుర్గం చెరువు లష్ కేఫ్ లో ప్రత్యేక స్క్రీన్ ను ఏర్పాటు చేశారు.

క్రికెట్ లవర్స్ కాఫీ తాగుతూ, స్నాక్స్, ఫుడ్ తింటూ మ్యాచ్ ఎంజాయ్ చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. మరికొన్ని పబ్ లు, రెస్టారెంట్లలో బిగ్ స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అదునుగా పలు రెస్టారెంట్లలో, పబ్ లలో లిక్కర్, ఫుడ్ ఐటమ్స్ ల ధరలను కూడా పెంచినట్లు సమాచారం. అటు గెటెడ్ కమ్యూనిటీస్, అపార్మెంట్ లలో సైతం క్రికెట్ లవర్స్ ప్రత్యేక స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వలర్డ్ కప్ ఫైనల్ కప్ మాదిరిగా ట్రీట్ చేస్తూ హైదరాబాద్, కోల్ కత్తా మ్యాచ్ ఎంజాయ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Similar News