మియాపూర్‌లో భారీ వర్షం..

మియాపూర్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి చిరు జల్లులతో మొదలై ప్రస్తుతం ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.

Update: 2023-05-11 08:18 GMT

దిశ, మియాపూర్: మియాపూర్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి చిరు జల్లులతో మొదలై ప్రస్తుతం ఏకధాటిగా  భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి  మియాపూర్ జాతీయ రహదారి, బొల్లారం రోడ్డు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమమయ్యాయి.  దీంతో  తీవ్రమైన ట్రాఫిక్ జాం  ఏర్పడింది. ఆ వైపు వెళ్లే వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత రెండు మూడు రోజులుగా ఎండవేడిమి, తీవ్రమైన  ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కాసింత ఊరట నిచ్చింది.  వాతావరణ శాఖ ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించిన నేపథ్యలో జల్లులు పడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News