పాతబస్తీలో నయా ట్రెండ్.. పెళ్లి కొడుకులా ముస్తాబయి నామినేషన్

మెడలో పూలదండ.. ఒంటిపై రాజస్థాన్ తరహాలో వస్త్రాధారణ ధరించి ఒంటె పై పెళ్లి కొడుకు అవతారంలో ఊరేగింపుగా మండపానికి వెళ్తున్నాడనుకుంటే పొరపాటే.

Update: 2024-04-25 08:03 GMT

దిశ, చార్మినార్: మెడలో పూలదండ.. ఒంటిపై రాజస్థాన్ తరహాలో వస్త్రాధారణ ధరించి ఒంటె పై పెళ్లి కొడుకు అవతారంలో ఊరేగింపుగా మండపానికి వెళ్తున్నాడనుకుంటే పొరపాటే. ఆయన పెళ్లి కొడుకు అసలే కాదు. మరి పెళ్లి కొడుకు కానప్పుడు పెళ్లి కొడుకు వస్త్రా ధారణలో ఒంటెపై ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా? పాతబస్తీ కబూతర్ ఖానకు చెందిన అనిల్ సేన్ హైదరాబాద్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలుకు వినూత్నంగా కలెక్టరేట్ కు బయలుదేరారు. గురువారం నామినేషన్ వేయుటకు వినూత్నంగా రాజస్థాని స్టైల్‌లో వస్త్రాధారణ వేసుకొని ఒంటె పై నామినేషన్ వేయడానికి బయలుదేరాడు. ఇలా ఎక్కడికి వెళ్తున్నారని అనిల్ సేన్ ను పలువురు ప్రశ్నించగా కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, పోటీచేసి ఓడి పోయానని, ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.

Similar News