మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్

రాష్ట్రంలో బీర్ల కొరతతో ఇబ్బందులు పడుతోన్న మద్యం ప్రియులకు మరో బ్యాడ్ న్యూస్. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ జంట నగరాల్లో వైన్

Update: 2024-04-15 12:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీర్ల కొరతతో ఇబ్బందులు పడుతోన్న మద్యం ప్రియులకు మరో బ్యాడ్ న్యూస్. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. 17వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా జంట నగరాల్లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని సూచించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైన్ షాపులు బంద్ అని తెలియడంతో మందుబాబులకు వైన్స్‌లకు క్యూ కడుతున్నారు.

Similar News