నాగోల్ లో మహిళ వినూత్న నిరసన

చిన్నపాటి వర్షానికి రోడ్లు గుంతలు గా మారి బురదమయంగా కావడంతో అధికారులు పట్టించుకోవడంలేదని నిరసిస్తూ… ఓ మహిళ గురువారం వినూత్న నిరసనకు దిగారు.

Update: 2024-05-23 12:11 GMT

దిశ , చైతన్య పురి : చిన్నపాటి వర్షానికి రోడ్లు గుంతలు గా మారి బురదమయంగా కావడంతో అధికారులు పట్టించుకోవడంలేదని నిరసిస్తూ… ఓ మహిళ గురువారం వినూత్న నిరసనకు దిగారు. నాగోల్ నుంచి బండ్లగూడ రోడ్డు లో ఉన్న ఆనంద్ నగర్ లో వర్షానికి రహదారులు అధ్వానం గా మారి నడవడానికి వీలు లేక పోవడం పట్ల రోడ్డుపై నిలిచిన నీటిలో కూర్చుని మహిళ వినూత్న నిరసన చేపట్టింది. రోడ్డు బాగు చేస్తామని హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకొని కూర్చోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడంతో ఆమె నిరసన విరమించారు. ఆమె నిరసన చేస్తుండడంతో వాహనదారులు, పాదచారులు ఆమెకు మద్దతు తెలిపి ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Similar News