13 మంది సెల్ ఫోన్ల దొంగల ముఠా రిమాండ్

13 మంది సెల్ ఫోన్ల దొంగల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. ఆసిఫ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని శనివారం సాయంత్రం రిమాండ్ కు తరలించారు.

Update: 2024-05-25 15:07 GMT

దిశ,కార్వాన్ : 13 మంది సెల్ ఫోన్ల దొంగల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. ఆసిఫ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని శనివారం సాయంత్రం రిమాండ్ కు తరలించారు. ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... ఈదీ బజార్ సంతోష్ నగర్ కు చెందిన మహమ్మద్ ముజఫర్ (35) సిమ్మింగ్ కోచర్, హఫీజ్ బాబా నగర్ కు చెందిన మహమ్మద్ ఖలీద్ (25), మొహమ్మద్ దస్తగిరి (28), మహమ్మద్ హైమద్ (18), మహమ్మద్ అలీ (30) సోహెల్ ఖాన్ (22) మొహమ్మద్ ఖాన్ (24) బాలాపూర్ ప్రాంతానికి చెందిన షేక్ మున్వర్ (22).

వీరందరూ కలిసి వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్లను దొంగతనం చేసి, చంచలగూడ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ సిరాజ్ (36), చాదర్ఘాట్ ప్రాంతానికి చెందిన మస్జిద్ ఖాన్ (30), ఇది బజార్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ హసీం (34) చంచల్ గూడా ప్రాంతానికి చెందిన జావిద్ అలీ (30), వీరంతా కలిసి వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన సెల్ ఫోన్ లను మహమ్మద్ మూస హుస్సేన్ కు అప్పగించేవారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు 13 మంది సెల్ ఫోన్ ల గ్యాంగును పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఆసిఫ్ నగర్ పోలీసులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసుకొని శనివారం సాయంత్రం రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

Similar News