వేసవి వేళ నగర ప్రజలకు బిగ్ షాక్.. మూడ్రోజులు తాగునీరు బంద్!

హైదరాబాదులోని పలు ప్రాంతాల ప్రజలకు వేసవి వేళ తాగునీటి కష్టాలు రానున్నాయి.

Update: 2023-05-08 08:21 GMT

వెబ్‌ డెస్క్: హైదరాబాదులోని పలు ప్రాంతాల ప్రజలకు వేసవి వేళ తాగునీటి కష్టాలు రానున్నాయి. ఆగస్టు 2021లో వరదల వల్ల నీట మునిగి నీటి కష్టాలు తెచ్చిపెట్టిన మోటార్లు, తాజాగా మరోసారి అధికారుల నిర్లక్ష్యంతో మళ్లీ నీట మునిగాయి. వివరాల్లోకి వెళితే.. నగరం నుంచి నీటి సరఫరా చేసేందుకు ఎల్లంపల్లి నుంచి సిద్ధిపేట జిల్లా మల్లారం హౌస్‌లోకి అధికారులు నీటిని విడుదల చేశారు. వాటర్ ఫిల్టర్‌లోని మోటార్లను సరైన టైమ్‌కు ఆన్ చేయకపోవడంతో పంప్ హౌస్ మొత్తం నీటిలో మునిగింది. ఆ నీటిని క్లియర్ చేసి మోటార్ ఆన్ చేయాలంటే 3 రోజుల సమయం పడుతుంది. దీంతో.. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, సైనిక్‌పురి, నిజాంపేట్, బాచుపల్లి, పటాన్‌చెరు ప్రాంతాల్లోని ప్రజలు తాగునీటి కష్టాలు రానున్నాయి. ప్రస్తుతం వీరికి సంబంధించిన అధికారులు నీటి సరఫరా చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మోటార్లు మునిగిపోయి గంటలు గడుస్తున్నా అధికారులు వెలికి తీయకపోవడం గమనార్హం.

Tags:    

Similar News