HYD : మలక్ పేట్ MLAపై కేసు నమోదు

మలక్ పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపై కేసు నమోదైంది.

Update: 2024-02-15 08:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: మలక్ పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపై కేసు నమోదైంది. హైకోర్టు సీనియర్ లాయర్ వేదుల వెంకటరమణ తరఫున ఎమ్మెల్యే బలాల బెదిరిస్తున్నారని యాదగిరి అనే వ్యక్తి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఓ ల్యాండ్ విషయంలో అనుకూలంగా తీర్పు ఇప్పిస్తానని లాయర్ వెంకటరమణ మోసం చేశారని బాధితుడు ఆరోపించారు. రూ.14 కోట్లు డిమాండ్ చేసి రూ.10 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తీర్పు అనుకూలంగా రాకపోగా డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. దీంతో వెంకటరమణ, బలాలపై కేసు నమోదు చేసి సీసీఎస్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News